మండలం కొత్తపేట గ్రామంలో సయ్యద్ హసీనా బేగం, అహ్మద్ దంపతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోందని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
కొత్తపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు కూడా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ పనులు గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ మీనుగు గంగుఅంజయ్య, ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, పాక్స్ చైర్మెన్ లు తంగెళ్ల రమేష్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏనుగు మల్లారెడ్డి, ఉప సర్పంచ్ రంజిత్, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, కరీం, రమేష్, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, జిల్లా ఎస్టీ సెల్ సురేందర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ముకీద్, తిరుపతి గౌడ్, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.











