మండలం కాగితా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలుకులపల్లి వెంకయ్య ఈరోజు మరణించారు. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండాను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నడిగూడెం మండలం కాగితా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలుకులపల్లి వెంకయ్య ఈరోజు మరణించారు. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండాను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బిక్షపతి, మండల మాజీ వైస్ ఎంపీపీ గుండు శ్రీనివాస్, కరివిరాల మాజీ సర్పంచ్ పాతపట్ల నాగేశ్వరరావు, రామచంద్రపురం మాజీ సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గురవారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరెడ్డి వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












