ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక సురక్షా సంహిత () సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఆంక్షలు 44 రోజుల పాటు అమల్లో ఉంటాయి.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు నుంచి వరకు అమల్లో ఉండనున్నాయి.
ప్రధాన ఆంక్షలు ఇవే:
బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, కర్రలు, రాళ్లు, ఇతర ప్రమాదకర ఆయుధాలను తీసుకెళ్లడంపై కూడా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






