హనుమకొండ, 2026-08-06
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
నివాళులర్పించిన అధికారులు
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, బల్దియా సి హెచ్ ఓ లాక్ష్మారెడ్డితో పాటు రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, వాకర్స్, తదితరులు పాల్గొన్నారు.