Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 09
జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఇటీవల రాయికల్, జగిత్యాల పట్టణాల్లో జరిగిన పలువురి దశమ, సంవత్సరీక కర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వివిధ దశమ కర్మ, సంవత్సరీక కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల: రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి గారి తల్లి లక్ష్మీ దశమ కర్మ కార్యక్రమానికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై, లక్ష్మీదేవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా జగిత్యాల గార్డెన్లో జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చక్రధర్, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ అమరేశ్వర్, డాక్టర్ శ్వేత గారి తల్లి మీనాక్షమ్మ దశమ కర్మ కార్యక్రమానికి అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. మీనాక్షమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన గోవిందపల్లె సునీల్ రావు గారి తల్లి సంవత్సరీక కార్యక్రమంలో కూడా అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులను కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.












