Karimnagar/Ganneruvaram (ధర్మ రథం) జూలై 31
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలసిరి కార్యక్రమంలో భాగంగా, తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, ఇంకుడు గుంతల నిర్మాణంపై రైతులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడానికి గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సభ జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలసిరి కార్యక్రమంలో భాగంగా రైతులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గునుకుల కొండాపూర్ సర్పంచ్ శ్రీ సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నందున రైతులందరూ ఆరుతడి పంటలు పండించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో వి సురేందర్, ఏవో కిరణ్మయి, ఐబీఏఈ రాజుకుమార్, ఉప సర్పంచ్ నేలపట్ల రమేష్, పంచాయతీ కార్యదర్శి పి రమేష్, పాలకవర్గ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ హన్మాండ్ల యాదగిరి, కారోబార్ ముల్కల అంజయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











