జూబ్లీ గార్డెన్ కాలనీ, మాదాపూర్ (ధర్మ రథం) సెప్టెంబర్ 15
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: .. .. ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి శాసనసభ్యులు హాజరయ్యారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ కాలనీలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. అనంతరం కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.












