కేశంపేట్, 13 September
రంగారెడ్డి జిల్లా మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ నర్సింగ్‌రావు, పోటీ చేసిన సర్పంచ్ ప్రేమ్‌కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ యువజన సంఘాలకు వినాయక విగ్రహాలను అందజేశారు.
కొండారెడ్డిపల్లిలో వినాయక విగ్రహాల పంపిణీ యువతను ప్రోత్సహిస్తూ రూ.3.20 లక్షల విరాళం అందించిన బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి జిల్లా మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ నర్సింగ్‌రావు, కంటెస్టెడ్ సర్పంచ్ ప్రేమ్‌కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ యువజన సంఘాలకు వినాయక విగ్రహాలను అందజేశారు. గత ఎనిమిదేళ్లుగా గ్రామంలోని యువతను ప్రోత్సహిస్తూ వినాయక విగ్రహాలను అందజేస్తున్న ప్రేమ్‌కుమార్ గౌడ్ ఈ ఏడాది కూడా వివిధ సంఘాలు, యువజన మండళ్లకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలోని 19 సంఘాలు, యూత్ సంఘాలకు కలిపి సుమారు రూ.3.20 లక్షల విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. బజరంగ్ దళ్ యూత్, అంబేద్కర్ యూత్, భగత్‌సింగ్ యూత్, ఫ్రెండ్స్ యూత్, న్యూ స్టార్ యూత్, గౌడ్స్ యూత్, వడ్డె సంఘం యూత్, మైసమ్మ సంఘం యూత్, త్రిశూల్ యూత్, ఆరే కటిక సంఘం యూత్, జై సేవాలాల్ తండా యూత్, యంగ్ స్టార్ యూత్ తదితర సంఘాలకు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో పండుగలను నిర్వహించుకోవాలని, యువతలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా వినాయక ఉత్సవాలకు సహకరిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న ప్రేమ్‌కుమార్ గౌడ్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల లింగం, వార్డు సభ్యులు వెంకట్రామ్రెడ్డి, మాధవ్, అరవింద్, దశరత్, రామకృష్ణారెడ్డి, ఉదయ్‌గౌడ్, కోనేరు శ్రీనివాస్, నిరంజన్, యాదయ్య, రాఘవేందర్, కుమ్మరి శివ, అనిల్, మనీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.












