కేశంపేట్, 12 September
మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. గ్రామంలో ఏర్పాటు చేయనున్న వివిధ వినాయక మండపాల నిర్వాహకులను, యువకులను ప్రోత్సహిస్తూ పల్లె బ్రదర్స్‌లో ఒకరైన పల్లె బాలేశ్వర్ రూ.2,50,000 చందా రూపంలో అందించారు. ఈ మొత్తాన్ని అందజేసి, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించిన పల్లె బ్రదర్స్ కొండారెడ్డిపల్లి గ్రామంలోని వినాయక మండపాలకు రూ.2.50 లక్షల విరాళం హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: పల్లె బాలేశ్వర్ మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఈసారి పల్లె బ్రదర్స్ తమ వంతు సహకారం అందించి ఉత్సవ కమిటీలకు అండగా నిలిచారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న వివిధ వినాయక మండపాల నిర్వాహకులు, యువకులను ప్రోత్సహిస్తూ పల్లె బ్రదర్స్‌లో ఒకరైన పల్లె బాలేశ్వర్ గారు మొత్తం రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) చందా రూపంలో అందించారు. గ్రామంలోని వినాయక మండపాల నిర్వాహకులకు ఈ మొత్తాన్ని అందజేసి, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పల్లె బాలేశ్వర్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ హిందూ సమాజానికి ఎంతో విశిష్టమైన పండుగ అని, గ్రామాల్లో యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువకులు ఐక్యంగా ఉండి, భక్తి భావంతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. అలాగే వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు భక్తి, క్రమశిక్షణతో కార్యక్రమాలను నిర్వహిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలని పల్లె బాలేశ్వర్ ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు. గ్రామంలోని వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల కోసం పల్లె బ్రదర్స్ అందించిన సహకారం ఎంతో అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా రూ.2.50 లక్షల భారీ విరాళాన్ని అందించడం ద్వారా పల్లె బాలేశ్వర్ యువతను, వినాయక ఉత్సవాలను ప్రోత్సహించారని తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యువతను ప్రోత్సహించేందుకు పల్లె బ్రదర్స్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన పల్లె బ్రదర్స్‌కు మండపాల నిర్వాహకులు, యువకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామంలో జరిగే ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పామ్ విజేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సర్పంచ్ శివకుమార్, సూరం శేఖర్, బుర్రి మల్లేష్ గౌడ్, వార్డు మెంబర్ బండ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ యువజన సంఘాల నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లె బాలేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పల్లె బ్రదర్స్ అందించిన రూ.2.50 లక్షల సహాయం ప్రస్తుతం కొండారెడ్డిపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. యువతను ప్రోత్సహిస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












