Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 10
జగిత్యాల రూరల్, లక్ష్మీపూర్: పూర్వికుల నుండి అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ లక్ష్మీపూర్ గ్రామంలో ఏకవాణి పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించారు
జగిత్యాల రూరల్, లక్ష్మి పూర్ :పూర్వికుల నుండి అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ లక్ష్మి పూర్ గ్రామంలో ఏకవాణి పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రావణమాసం ముందు రోజు స్థానిక హనుమాన్ గుడిలో పగలు 2 గంటలకు భజన మొదలు పెట్టి, మరుసటి రోజు (ఈరోజు )పగలు 2 గంటల వరకు నిరాటంకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గుడిలో పూజలు నిర్వహించి,పాలు, బెల్లం, గోధుమరవ్వతో వరదపాయసం వండారు. గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు భజనలు చేస్తూ ఊరేగింపుగా గ్రామంలోని పెద్ద చెరువు వద్దకు చేరుకొని. అక్కడ చెరువులో స్నానాలు ఆచరించి తడిబట్టలతో చెరువు సమీపంలోని జగన్నాధ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు వున్న పరుపు బండపై పాయసం పోసిన తరువాత భక్తులు మోకాళ్లపై కూర్చొని ఆపాయసం నాకడం ఏకవాణి పండుగలో ప్రత్యేక ఆచరంగా కొనసాగుతుంది.ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్బంగా దేవున్ని ప్రార్ధించారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా భవిష్యత్తు తరాలు కూడా ఈ సంప్రదాయం కొనసాగించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు












