Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 15
మధిర పట్టణంలోని రైల్వే గేట్ సెంటర్ వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు భక్తులను, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ కమిటీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
*రైల్వే గేట్ సెంటర్లో ఆకట్టుకుంటున్న ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు.* *20వ వార్షికోత్సవంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించనున్న వినాయక విగ్రహ ఊరేగింపు.* *మధిర పట్టణంలోని రైల్వే గేట్ సెంటర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు భక్తులు, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవాల సందర్భంగా కమిటీ సభ్యులు ఎంతో వ్యయప్రయాసలు చేస్తూ భారీ ఎత్తున వినాయక విగ్రహ ఊరేగింపును నిర్వహించడం, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది.గత రెండు దశాబ్దాలుగా భక్తుల ఆదరణను పొందుతూ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా వినాయక నిమజ్జన ఊరేగింపును భారీ జనసమీకరణతో వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.*












