సందర్శించిన (ధర్మ రథం) సెప్టెంబర్ 13
మధిరలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల అవస్థలకు కారణమవుతోంది. అత్యవసర సేవలు సైతం సక్రమంగా అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సెలైన్ సగం కారిపోతున్నా పట్టించుకోకపోవడం, వైద్యులు తమ డ్యూటీ కాదంటూ తప్పించుకోవడం వంటి ఘటనలు వైద్య వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
*మధిర 100 పడకల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. రోగుల అవస్థలు!* *సగం సెలైన్ కింద కారుతున్నా పట్టించుకోని సిబ్బంది.. ‘రెండు చుక్కలేగా’ అంటూ హెడ్ నర్స్ వెటకారం* *ఇది నా డ్యూటీ కాదు’ అంటూ తప్పించుకుంటున్న వైద్యులు* *ఉప ముఖ్యమంత్రి భట్టి నియోజకవర్గం కేంద్రం మధిరలో అధ్వానంగా మారిన ప్రభుత్వ వైద్యం..* *ఫొటోలకే పరిమితమైన కలెక్టర్ తనిఖీలు.. వైద్యం శూన్యం!* *నిన్నే 100 పడకల ఆసుపత్రి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్* మధిర నియోజకవర్గ కేంద్రం మధిరలో పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి పరాకాష్టకు చేరింది. అత్యవసర వైద్య సేవల కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలైన్ కింద కారుతున్నా పట్టని నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రిలో కనీస సేవల పట్ల సిబ్బంది ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం రోగుల ప్రాణాలతో చాలగటం. అనారోగ్యంతో వచ్చిన ఓ రోగికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా, అది సగం వరకు కిందకు కారిపోతున్నా గమనించని దుస్థితి నెలకొంది. రోగి బంధువులు విషయాన్ని గుర్తించి వార్డులో ఉన్న నర్సును అడగ్గా, అక్కడికి వచ్చిన హెడ్ నర్స్ సమస్యను సరిదిద్దాల్సింది పోయి ఎదురు దాడికి దిగడం విస్మయానికి గురిచేసింది. "ఏమి.. రెండు చుక్కలేగా కింద పడేది, దానికింత గొడవా?" అంటూ నిర్లక్ష్యంగా, వెటకారంగా సమాధానం చెప్పడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ డాక్టర్ను ప్రశ్నించగా ‘నా డ్యూటీ కాదు’ అంటూ వైద్యుల దాటవేత నొప్పి, బాధతో అల్లాడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాధితులను పరీక్షించడంలో వైద్యులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. "ఇది నా డ్యూటీ కాదు, వేరే డాక్టర్ వస్తారు వారినే అడగండి" అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇస్తూ దాటవేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చినా నిమిషాల వ్యవధిలో చికిత్స అందించాల్సిన వైద్యులే ఇలాంటి సమాధానాలు చెప్పడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. ఫొటోలకే పరిమితమైన అధికారుల పర్యటనలు వంద పడకల ఆసుపత్రి విస్తరణ, మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పర్యటనలు చేయడం, ఆసుపత్రి ప్రాంగణంలో ఫొటోలు దిగి వెళ్లడానికే పరిమితమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై సమీక్షలు లేకపోవడంతో ఆసుపత్రిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, అధికారుల పర్యటనల వల్ల ఫలితం శూన్యంగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఈ దుస్థితా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఇంత దారుణంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.










