మధిర, 11 September
వినాయక చవితి పండుగ సందర్భంగా మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించేవారు తప్పనిసరిగా ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలని రూరల్ ఎస్సై విశ్వతేజ సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
*వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: రూరల్ ఎస్సై విశ్వతేజ* వినాయక చవితి పండుగ సందర్భంగా మండలంలో మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా.. ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలని రూరల్ ఎస్సై విశ్వతేజ వారు సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూరల్ ఎస్సై విశ్వతేజ వారు మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ, అనుమతులు, ఫైర్, విద్యుత్ శాఖల నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారులకు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, మందుగుండు సామగ్రి వినియోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్ధాలు సేవిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.












