జగిత్యాల, 14 September
మెట్పల్లి మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ 145 ప్లాంట్లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద ఎత్తున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు.
మెట్పల్లి మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ 145 ప్లాంట్లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ ప్రతి ఏటా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా డప్పు, సన్నాయి వాయిద్యాల నడుమ, మంగళ వాయిద్యాల సమక్షంలో మిషన్ భగీరథ కార్మికులు కలిసి గణనాథుడిని మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇన్చార్జ్ ఎంపీ నాగరాజు, తిరుపతి, గణేష్, బైండ్ల శీను, రాజ్ కుమార్ మరియు మిషన్ భగీరథ కార్మికులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు.












