Nalgonda/Nalgonda (ధర్మ రథం) ఆగస్టు 01
నల్గొండ, తిప్పర్తి మండలాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పావురాల గూడెంలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి, చౌకధర దుకాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నల్గొండ జిల్లా, నల్గొండ, తిప్పర్తి మండలాలలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ మండలం చిన్న సూరారం హమ్లెట్ గ్రామం పావురాల గూడెంలో కోటి 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పిడబ్ల్యుడి సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది, స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా చిన్నసూరారంలో వేర్ హౌసింగ్ గోడౌన్ లేదా రైస్ మిల్ ఏర్పాటుకు 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళా సంఘాలు పొదుపుతో పాటు, ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే సాధికారత సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని మంత్రి ఆదేశించారు.
పావురాల గూడెంలో చౌకధర దుకాణం లేకపోవడం, చిన్న సూరారం వరకు వచ్చి రేషన్ తీసుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి, తక్షణమే పావురాల గూడెంలో చౌకధర దుకాణాన్ని మంజూరు చేసి, డీలర్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ పి. మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధనలక్ష్మి, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










