మునగాల, 2026-08-15
మునగాల మండల కేంద్రంతో పాటు పరిధిలోని వివిధ గ్రామాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుతూ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
మునగాల మండల కేంద్రంతో పాటు పరిధిలోని వివిధ గ్రామాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుతూ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు
రెవిన్యూ కార్యాలయంలో తాసిల్దార్ సరిత, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, సర్కిల్ కార్యాలయంలో సిఐ రామకృష్ణారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎం సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం పి వెంకటేశ్వర్లు జెండాలను ఆవిష్కరించారు.
గ్రామ పంచాయతీలలో సర్పంచుల ఆధ్వర్యంలో
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, సింగల్ విండో కార్యాలయంలో చైర్మన్ కందిబండ సత్యనారాయణ, వ్యవసాయ కార్యాలయంలో ఏవో బుంగ రాజు, విద్యుత్ ఉపకేంద్రంలో ఏఈ వికాస్, గ్రంథాలయంలో ఇంచార్జ్ అనంత శ్రీను జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
పాఠశాలలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో
న్యూ ప్రజ్ఞ పాఠశాలలో కరస్పాండెంట్ కే కృష్ణమూర్తి, ట్రినిటీ పాఠశాలలో కరస్పాండెంట్ జాకప్ రాజ్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు కూడా జెండాను ఎగురవేశారు.
ప్రజల భాగస్వామ్యం
మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమాలలో గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.












