నడికూడ, 2026-08-14
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం స్థానిక మారుతి ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో నాలుగో స్తంభమైన జర్నలిజం ఎంతో పవిత్రమైనది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సమాజ శ్రేయస్సును కాపాడటంలో పాత్రికేయుల పాత్ర అమోఘం. నడికుడ మండలంలో జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నిష్పక్షపాత వార్తల రచనకు పిలుపు
నూతన బాధ్యులు నిష్పక్షపాతంగా, ప్రజల పక్షాన నిలిచి వార్తలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులందరినీ శాలువాలు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో స్థానిక మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.










