రంగారెడ్డి, 13 September
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం పోమల్పల్లికొండారెడ్డిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నంది విగ్రహ ప్రతిష్ఠ, మండప నిర్మాణంపై ఆదివారం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు సమావేశమయ్యారు. ఈ నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నంది మండప నిర్మాణంపై చర్చ కేశంపేట్: పోమల్పల్లి–కొండారెడ్డిపల్లి గ్రామాల పరిధిలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నంది విగ్రహ ప్రతిష్ఠ, మండప నిర్మాణంపై ఆదివారం ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, యువకులు చర్చించారు. మండప స్థలం, నిర్మాణ విధానం, భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నంది మండపం పూర్తయితే ఆలయానికి మరింత శోభ చేకూరుతుందని, అభివృద్ధికి అందరూ సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుమ్మరి సత్యనారాయణ, ధర్మకర్త కంచుకోట యాదగిరి, మాజీ జెడ్పీటీసీ పల్లె నర్సింగరావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, యువ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ తదితరులుగ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.












