Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 13
మానస హిల్స్‌లో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో అధికారుల మౌనంపై కమిషన్ నిలదీసింది. పొంగులేటి సొంత సంస్థ అయిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పొంగులేటి అక్రమ మైనింగ్‌పై ఎన్హెచ్ఆర్సీ కొరడా..! మానస హిల్స్‌లో రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం 2 నెలల్లోగా రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై చర్యలు చేపట్టాలని కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు పొంగులేటి సొంత సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అధికారుల మౌనంపై కమిషన్ నిలదీత బాధితులు, ఫిర్యాదుదారుడిని భాగస్వామ్యం చేస్తూ 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని హుకుం కేసు దాఖలు చేసిన లాయర్ రామారావు ఇమ్మనేనికి కూడా సమాచారం ఇవ్వాలని సూచన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై గతంలో అసెంబ్లీలో నిలదీసిన కేటీఆర్, హరీష్ రావు.











