పోతుగల్ (ధర్మ రథం) ఆగస్టు 15
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ - శ్రీనివాస్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు.
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ - శ్రీనివాస్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో పాటు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోల కృష్ణ, మాజీ సర్పంచ్ ద్యావతి పండరి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్ తో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, పాఠశాల విద్యార్థులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు.












