హనుమకొండ, 2026-06-05
హనుమకొండలోని ఆర్డీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.
హనుమకొండలోని ఆర్డీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు అధిక సంఖ్యలో సాంప్రదాయబద్ధంగా బోనాలు తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పోచమ్మకుంటలో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల వాయిద్యాలు, జై మహంకాళి నినాదాలతో కళాశాల ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ సంజీవ్ రావు, సురేష్, రాంబాబు, డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ బోనాలు తెలంగాణ ప్రజల ఆరాధ్య పండుగ మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి యువత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలని విద్యార్థినులకు సూచించారు.
బోనాల పండుగ ప్రాముఖ్యత
బోనాల పండుగ అనేది అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించే తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయ ఉత్సవమని, ఐకమత్యం, భక్తి, సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగగా ప్రతి ఒక్కరూ దీనిని గౌరవించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.











