సంగారెడ్డి (ధర్మ రథం) సెప్టెంబర్ 09
సంగాద్వారాడి కలెక్టరేట్ ఆవరణలోని (డీఐఫిర్యాదువో) అనుకూల నివేదిక డీఐఫిర్యాదువో ఫిర్యాదును హ్యాండెడ్గా
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఐఈవో గోవింద : సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన డీఐఈవో గోవింద రాం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సంఘటన వివరాలు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఇన్స్పెక్షన్ పూర్తి చేసి, పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద రాం రూ. 50,000/- లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా గత వారమే బాధితుడు రూ. 30,000/- ముట్టజెప్పాడు. మిగతా రూ. 20,000/- కోసం డీఐఈవో పదేపదే ఫోన్ చేసి వేధించడంతో విసిగిపోయిన బాధితుడు ధైర్యం చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం, కార్యాలయంలోనే బాధితుడి నుండి రూ. 20,000/- లంచం తీసుకుంటుండగా గోవింద రాంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రజల ఆగ్రహం: ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్న అధికారులు ఇలా రోజురోజుకూ అవినీతికి పాల్పడుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీకి పట్టుబడిన అధికారులను కేవలం సస్పెండ్ చేయడం కాకుండా, శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించేలా కఠిన చట్టాలు తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఏసీబీ అధికారుల సంప్రదింపు నెంబర్లు: తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్: 1064 ఏసీబీ హెడ్క్వాటర్స్ కంట్రోల్ రూమ్: 040-23251555 /మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కార్యాలయం: సంబంధిత స్థానిక ఏసీబీ అధికారులను లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.











