శాయంపేట్ (వరంగల్), 13 September
మండలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై కూలిన చెట్టును తొలగించడంలో జాప్యం జరుగుతోంది. తహరాపూర్ నుండి వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గంటలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో రోడ్డుపై కూలిన చెట్టు సరిగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన చెట్టును తొలగించి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.