జగిత్యాల, 31 July
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని అల్లమయ్యగుట్ట ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందుతున్న సోమ గంగాధర్ ఘన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా పరిధిలోని అల్లమయ్యగుట్ట ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందుతున్న సోమ గంగాధర్ ఘన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నునావత్ రాజు మాట్లాడుతూ... విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సోమ గంగాధర్ సుమారు 24 సంవత్సరాల పాటు నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలు భావితరాల ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం గంగాధర్ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందప్రశాంతతలతో కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన సభలో ఎంపీడీవో ఓదెల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనగా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ రావు, జోస్నా, మాజీ మండల విద్యాధికారి సుధాకర్, ఉపాధ్యాయులు మహేష్, భవాని, శేఖర్, రాధ, సీఆర్పీ గంగాధర్ తదితరులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












