ప్లాజాల్ (ధర్మ రథం) సెప్టెంబర్ 02
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. నకిలీ టోల్ రసీదులు సృష్టించి నిధులు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
టోల్ ప్లాజాల్లో అక్రమాలపై ఈడీ దర్యాప్తు
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది.
వివిధ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద అనధికారిక సాఫ్ట్వేర్ యాప్లను ఉపయోగించి నకిలీ టోల్ రసీదులు సృష్టించి డబ్బు మళ్లిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఇందులోభాగంగా
మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి, దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు చేసింది.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, దిల్లీ, పశ్చిమబెంగాల్లో 14 ప్రాంగణాల్లో సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.












