Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 09
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా ఆవులు లేదా కోడెలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని దేవస్థానం నిర్ణయించింది. అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వేములవాడ రాజశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదానం వేములవాడ :శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా 2 ఆవులు/ కోడెలు ఉచితంగా అందచేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలియ చేసారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన రైతులు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు,దరఖాస్తు ఫారం,భూమి పాస్ బుక్,వ్యవసాయా శాఖ అధికారుల గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.అలాగే దరఖాస్తుదారులు గోశాల నుండి గోవులను తీసుకుపోవాల్సి ఉంటుంది.ఇదివరకు తీసుకోని వారికి మాత్రమే అవకాశం అలాగే 1.2 నుండి 5 ఎకరాల వరకు భూమి వున్న రైతులు మాత్రమే అర్హులు అని ప్రకటనలో పేర్కొన్నారు.












