బీర్కూరు (ధర్మ రథం) ఆగస్టు 25
బీర్కూరు మండల కేంద్రంలో మండల ఫోరం ఎన్నికల వివాదం తలెత్తింది. పోచారం వర్గం కోరం లేకుండానే అధ్యక్షుడిని ఎన్నుకుందని, తమ ఎన్నిక చెల్లుతుందని ఉపాధ్యక్షుడు రెంజర్ల అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీర్కూరు మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో, పోచారం వర్గం కోరం లేకుండానే ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం బాధాకరమని, తాము ఎన్నుకున్న అధ్యక్షుడు చెల్లుతారని ఉపాధ్యక్షుడు రెంజర్ల అనిల్ కుమార్ తెలిపారు. తాము ఆరుగురు సర్పంచుల మద్దతుతో మండల ఫోరం అధ్యక్షుడుగా అరిగే ధర్మతేజను ఎన్నుకున్నామని, కాబట్టి తమ ఎన్నిక చెల్లుతుందని, పోచారం వర్గం ఎన్నిక చెల్లదని ఆయన పేర్కొన్నారు.
మెజారిటీ సర్పంచుల మద్దతు కీలకం
బీర్కూరు మండలంలో మొత్తం 13 గ్రామాలున్నాయని, ఫోరం అధ్యక్ష ఎన్నికకు ఏడుగురు సర్పంచుల మెజారిటీ అవసరమని, కానీ పోచారం వర్గం కేవలం ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని, ప్రజలకు ఈ విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు. రాజకీయాలను తాము కాదని, పోచారం వర్గమే ఖూనీ చేసిందని, నిధులు తమ ఏడుగురు సర్పంచులకు కాకుండా, వారి ఆరుగురు సర్పంచులకు ఎలా వస్తాయని, అప్పుడు తమకు గుర్తుకు రాలేదా అని ఉపాధ్యక్షుడు ప్రశ్నించారు. దీనికి శంకర్ సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
మానవత్వం ముఖ్యం
పార్టీలు శాశ్వతం కాదని, మానవత్వమే శాశ్వతమని, ఇకనైనా పెద్ద మనసుతో, కలిసికట్టు భావనతో వర్గ విభేదాలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అరిగే ధర్మతేజ, రేంజర్ల అనిల్ కుమార్, కవితా పండరి, సుధారాణి రాములు, శ్రీనివాస్, రామచందర్, మహేష్ పాల్గొన్నారు.












