జగిత్యాల, 2 September
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు జెల్ల రవీందర్ తో పాటు పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగిత్యాలలో వై ఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్బంగా జగిత్యాల ఎం ల్ ఎ డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు జెల్ల రవీందర్ మొదలైన కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వై ఎస్ ర్ ప్రజలకు అందించిన సేవలను, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనీ పేర్కొన్నారు











