Jagtial/Koratla (ధర్మ రథం) సెప్టెంబర్ 03
కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, ఇటీవల వీర హనుమాన్ విజయయాత్రలో గాయపడిన ఒక కార్యకర్తకు అండగా నిలిచారు. ఆయన సేవా నిరతికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన అందరి మన్ననలు పొందింది.
🙏 *నిస్వార్థ సేవే నాయకత్వానికి నిజమైన చిరునామా* 🙏 *Dr_అనూప్_రావు గారికి సెల్యూట్* 🚩 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి డా. అనూప్ రావు అన్నగారు కోరుట్ల నియోజకవర్గ బీజేపీకి లభించిన ఒక ఆణిముత్యం. పదవిని ఒక బాధ్యతగా భావిస్తూ, ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ, కష్టసుఖాల్లో వారికి అండగా నిలబడే నిస్వార్థ సేవకుడు, మంచి మనసున్న నాయకుడు డా. అనూప్ రావు గారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే ప్రతి కార్యకర్తకు ధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యమైనా, కష్టసమయమైనా స్వయంగా వారి ఇంటికి వెళ్లి పలకరించడం, ఓదార్పు ఇవ్వడం, అవసరమైన సమయంలో అండగా నిలబడడం ఆయన ప్రత్యేకత. కోరుట్ల నియోజకవర్గానికి బీజేపీకి పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ప్రతి కార్యకర్తను కలుపుకుపోతూ, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ముందుకు సాగుతున్న నాయకత్వం నిజంగా అభినందనీయం. మన ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నగారి నాయకత్వంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గారి సమక్షంలో బీజేపీ కుటుంబంలోకి వచ్చిన నాటి నుంచి, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ అందరినీ కలుపుకుపోతున్నారు. *కార్యకర్తకు కష్టం వస్తే… నాయకుడు అండగా నిలవాలి* ఇటీవల కోరుట్ల పట్టణంలో జరిగిన వీర హనుమాన్ విజయయాత్రలో గాయపడిన ఒక కార్యకర్తకు డా. అనూప్ రావు గారు దగ్గరుండి వైద్యం అందించడం, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడం ఆయన సేవాభావానికి నిదర్శనం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందించడం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంది. పార్టీ అంటే కేవలం రాజకీయాలు కాదు… కార్యకర్తలే కుటుంబం అని ఆచరణలో చూపిస్తున్న నాయకుడు డా. అనూప్ రావు గారు. కార్యకర్తల కష్టాల్లో ముందుండి నిలబడే ఇలాంటి నాయకత్వం బీజేపీకి ఎంతో బలం. నిస్వార్థ సేవకు… కార్యకర్తల పట్ల మీ ఆప్యాయతకు… పార్టీ పట్ల మీ నిబద్ధతకు… మనస్ఫూర్తిగా సెల్యూట్ అన్నగారు! 🙏 *జై బీజేపీ* 🚩











