రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం పలివెలలో ఆయన 161 మంది లబ్ధిదారులకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను ఆర్డీఓ సత్యనారాయణ, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి, కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
*రాష్ట్ర అభివృద్ధి కోసం,ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుంది...* *పలివెలలో 161 మందికి రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...* రాష్ట్ర అభివృద్ధి కోసం,ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దీనికి నిదర్శనం కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి,సంక్షేమాలేనని నొక్కి వక్కాణించారు. గురువారం పలివెలలో ఆయన 161 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణ,రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి,కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. లబ్ధిదారులకు రెండు సెంట్లు చొప్పున ఇండ్ల స్థలాలను పొజిషన్స్ చూపించి అందజేశారు. ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతుందన్నారు. పలివెలలో ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్మార్గాలను ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు. 2009 లో పట్టాలు అందించడం జరిగిందన్నారు.గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు రెండు సెంట్లు అందకుండా చేయడం నిమిత్తం, ఇష్టానుసారంగా వాళ్లకు నచ్చిన వాళ్లకు ఇవ్వడం కోసం రెండు సెంట్లు రద్దు చేసి సెంటున్నర, సెంటు పావు మాత్రమే కొత్తగా పట్టాలు ఇవ్వాలని ప్రయత్నం చేశారని, తెలుగుదేశం నాయకులు ఈ అంశంపై పోరాడి జైలుకు కూడా వెళ్లారని, హైకోర్టుకు వెళ్లి కేసు వేసి విజయం సాధించారని పేర్కొన్నారు. నేడు లబ్ధిదారులకు 2సెంట్ల చొప్పున 161 మందికి పొజిషన్స్ చూపించడం జరిగిందన్నారు. ఇది ఆనాడు పలివెల నాయకులు చేసిన పోరాటానికి లభించిన విజయమన్నారు.ఇప్పుడు ఇచ్చిన స్థలాల్లో ఎవరు ఇల్లు నిర్మించుకుందామనుకున్నా వెంటనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. వెంటనే విద్యుత్ సదుపాయం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని విమర్శించారు. ఏడాదికి 250 చొప్పున కాకుండా ఒకేసారి చెప్పింది చెప్పినట్లుగా పింఛన్ల మొత్తాన్ని రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, దివ్యాంగుల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.6 వేలు చేసామన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు జమ చేసామన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల ఇబ్బందులను తీర్చి ప్రశాంతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మూడు లక్షల నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారన్నారు.










