గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి తగిన ప్రోత్సాహం అందించడమే చేయూత ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లా కబడ్డీ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వయంగా కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
దాతలకు సన్మానం
కబడ్డీ పోటీల నిర్వహణకు సహకరించిన దాతలను, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను చేయూత ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ నలమాధ శ్రీకాంత్ యాదవ్, ఫౌండేషన్ సభ్యులు చిత్తలూరి అనిల్, మండల సమన్వయ సమితి సభ్యులు అనంతుల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షుడు భువనగిరి ఉపేందర్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కాసాని సతీష్, వార్డు సభ్యురాలు దున్న మనీషా, బీఆర్ఎస్ నాయకులు అనంతుల మహేష్, పోలేపల్లి వెంకటేశ్వర్లు, నల్లమాద నారాయణరావు, మేకల గంగరాజు, ఎస్కే జలీల్, ఎండీ రఫీ, మౌలానా, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, చేయూత ఫౌండేషన్ సభ్యులు మేకల వీరబాబు, మేకల సాయి, శనగని కరుణాకర్, శ్రీరాముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.











