జగిత్యాల, 2026-08-27
జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జరిగిన సర్ ముసాయిదా గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జరిగిన సర్ ముసాయిదా గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా ఓటర్ల జాబితా వివరాలను ప్రజలకు చదివి వినిపించి, పారదర్శకంగా పరిశీలన చేపడుతున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. సంబంధిత నోటీసులు వారం రోజుల్లో ఓటర్ల ఇళ్లకు చేరుతాయని, నోటీసులు అందుకున్న వారు అందులో పేర్కొన్న గడువులోగా అవసరమైన ఆధారాలను సంబంధిత బిఎల్ఓ ()కు సమర్పించాలని సూచించారు. ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, కుల ధృవీకరణ పత్రం తదితర గుర్తింపు పత్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. నోటీసులో పేర్కొన్న తేదీన లేదా అంతకంటే ముందే అవసరమైన పత్రాలను సమర్పిస్తే, పరిశీలన అనంతరం సంబంధిత ఓటరు వివరాలను ఆన్లైన్లో సరిచేసే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఓటర్ల డేటాలో గుర్తించిన అసాధారణతలు () ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పుట్టిన తేదీల్లో తప్పులు, కుటుంబ సభ్యుల మధ్య వయస్సుకు సంబంధించిన అసాధారణ వ్యత్యాసాలు, తెలుగుఇంగ్లీష్ అనువాదంలో ఇంటిపేర్లు మారడం వంటి డేటా లోపాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. సంబంధిత ఓటర్లు సరైన ఆధారాలను సమర్పించి తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు
ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు అనవసరంగా తొలగిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అదే సమయంలో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి వివరాలను నిబంధనల ప్రకారం తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామసభల ప్రాముఖ్యత
గ్రామసభల ముఖ్య ఉద్దేశం తొలగించబోయే ఓట్ల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, వారికి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించడం, తద్వారా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమేనని స్పష్టం చేశారు.












