నల్గొండ, 2026-06-05
నల్గొండ కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నగరపాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జరగనుంది.

ఏర్పాట్ల పరిశీలన
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలిక మేయర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ లోకీ లాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్ సమద్, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.