కోరుట్ల, జూలై 26
మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన కార్గిల్ యుద్ధ అమరవీరులకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి, భారత త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టిన కార్గిల్ యుద్ధ అమరవీరులకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ఏబీవీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు నింపిన సైనికుల అచంచల ధైర్యం, అసమాన శౌర్యం, అప్రతిహత దేశభక్తి ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్గిల్ గడ్డపై భారత సైన్యం ప్రదర్శించిన వీరత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
"నీ స్వేచ్ఛా జీవితం వెనుక ఎందరో వీర సైనికుల త్యాగం దాగివుంది.. ఆ త్యాగాన్ని మరవబోకు భారత జాతి పౌరుడా!" అని పిలుపునిచ్చారు.
అమరవీరుల త్యాగాలు యుగయుగాల పాటు రాబోయే తరాలకు దేశసేవ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయని ఏబీవీపీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు, యువకులు మరియు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.









