జగిత్యాల, 2026-06-05
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి ప్రారంభించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో అల్లీపూర్ గ్రామానికి చెందిన చిలుముల మల్లేశ్వరి, ప్రవీణ్ దంపతులకు మొదటి విడతలో మంజూరైన ఇంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి.

కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ గృహ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు యం.ఏ.మోఖీద్, దొబ్బల వేణు పాల్గొన్నారు. అలాగే, వార్డ్ సభ్యులు జాగిరి ప్రశాంత్, గ్రామ సెక్రటరీ శేఖర్, నాయకులు ఎంబారి వెంకటష్, ప్రేమ్ చంద్, శ్రవణ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.