Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 03
జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామాల్లో నాణ్యత లేని మటన్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. శ్రావణమాసం కారణంగా గిరాకీ లేక, నిన్న, మొన్న కోసిన మాంసం అమ్ముడుపోక మిగిలిపోవడంతో, దానిని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి మూడు, నాలుగు రోజుల పాటు విక్రయిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల రూరల్ గ్రామాల్లో నాణ్యత లేని మట్టన్ విక్రయిస్తున్నారని వినియోగ దారుల అనుమానం జగిత్యాల :జగిత్యాల రూరల్ గ్రామాలల్లో నాణ్యత లేని నిన్న, మొన్న కోసిన మట్టన్ విక్రయిస్తున్నారని వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. శ్రావణమాసం కారణంగా గిరాకీ లేక కోసిన మట్టన్ అమ్ముడు పోక మిగిలి పోవడంతో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి మూడు నాలుగు రోజుల పాటు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మట్టన్ తాజాగా కనిపించడం లేదని,ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి తెచ్చినట్టు చల్లగా ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై కొందరు వినియోగ దారులు నిలదీయగా జగిత్యాల లలో మాత్రమే నిన్న మొన్నటి మాంసం అమ్ముతాము కానీ గ్రామం లో అమ్మము అని చెప్పడం కోసమెరుపు.










