మండలం, గ్రామానికి చెందిన రైతు చందనగిరి మనోహర చారి తన రెండు ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ తోటను ఉద్యాన విస్తరణ అధికారి బి. రాజేష్ నాయక్ సోమవారం సందర్శించారు.
గ్రామానికి చెందిన రైతు చందనగిరి మనోహర చారి, ఉద్యాన శాఖ సూచనల మేరకు గత ఏడాది తనకున్న రెండు ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు. ఈ సాగు ద్వారా అధిక దిగుబడి వస్తుందని, రైతుకు మంచి ఆదాయం సమకూరుతుందని ఉద్యాన విస్తరణ అధికారి బి. రాజేష్ నాయక్ తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ఉద్యాన శాఖ అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన ఆకాంక్షించారు.












