నడిగూడెం మండలం కేశవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద పశువుల కొట్టాల నిర్మాణం కోసం దున్న విజయ్ అనే రైతుకు కంప్యూటర్ ఆపరేటర్ కృష్ణయ్య లంచం డిమాండ్ చేసి, ఇవ్వలేదన్న కారణంతో బిల్లును ఆపేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై రైతు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేశవాపురం గ్రామ పంచాయతీలో దున్న విజయ్ అనే రైతు పశువుల కొట్టాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన వర్క్ ఐడీ నంబర్ 3642015//7182 358358. టెక్నికల్ అసిస్టెంట్ గారు నంబర్ /323, 2024-25, పేజీ నంబర్ 1-12 లో రికార్డు చేసి, వేజ్ లిస్ట్ నంబర్ 3642015--149 ప్రకారం రూ.62,444/- లకు గాను 12-06-2025 తేదీన పేమెంట్ జనరేట్ చేయడం జరిగింది.
అయితే, బిల్లు పాస్ కావాలంటే తనకు రూ.10,000 లంచం ఇవ్వాలని కంప్యూటర్ ఆపరేటర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రైతు దున్న విజయ్ రూ.5,000 గారి ద్వారా పంపారు. మిగతా డబ్బులు బిల్ వచ్చాక ఇస్తానని చెప్పినా, కృష్ణయ్య కనికరించలేదు. వేజ్ మరియు మెటీరియల్ కు ఒకటే అకౌంట్ ఇచ్చావని, అందుకే పేమెంట్ రిజెక్ట్ అయిందని, వేరే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని చెప్పి, అతన్ని మభ్యపెట్టి మూడు సార్లు అకౌంట్ నంబర్ తీసుకున్నారు.
వాస్తవానికి, వేజ్ కు సంబంధించినది పోస్టల్ అకౌంట్ కాగా, మెటీరియల్ కు ఇచ్చినది అకౌంట్. ఇందులో ఎటువంటి సమస్య లేనప్పటికీ, లంచం ఇవ్వలేదన్న కారణంతో ఆ వర్క్ ఐడీని గారితో ఫిజికల్ కంప్లీట్ చేయించి, బిల్లును ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. బిల్లు పాస్ చేయడానికి ఉపయోగించే డిజిటల్ సిగ్నేచర్ కీలను 1 -, 2 - వాస్తవంగా ఆపరేట్ చేయవలసి ఉండగా, కంప్యూటర్ ఆపరేటర్ గారు ఆపరేట్ చేస్తూ అప్లోడ్ చేయకుండా, సాకులు చెప్పి, ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. దీని వలన ఆ పేమెంట్ ల్యాప్స్ అయింది.
సంవత్సరన్నరగా కార్యాలయం చుట్టూ తిరిగినా, రేపు మాపు అంటూ కాలయాపన చేశారు. విసిగిపోయి బిల్లు ఇస్తారా లేదా అని గట్టిగా అడగగా, వర్క్ క్లోజ్ అయిందని, రీ-ఓపెన్ చేయించుటకు పై అధికారులకు పంపినామని చెప్పి చేతులు దులుపుకున్నారు. గారిని పక్కదోవ పట్టించి, వర్క్ రీ-ఓపెన్ చేయుటకు జిల్లాకు లెటర్ పెట్టించాడు. ఈ విషయమై రైతు గారిని కలిసి చెప్పగా, 99 రాకపోవచ్చని, వారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
డబ్బులు తీసుకొని తనకు నష్టం చేశారని రైతు భోరున విలపిస్తూ, అప్పుచేసి వడ్డీలు కడుతున్నానని, తనకు న్యాయం చేయాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఏపీఓ వెంకన్న, ఈసీ ఉమ్లా నాయక్ లకు కూడా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని తెలుస్తోంది. ఉపాధి కూలీలు, లబ్ధిదారులు కార్యాలయానికి వెళితే వారి పట్ల గౌరవం లేకుండా వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ తో ఇబ్బంది పెట్టేవాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.












