హనుమకొండ, 2026-06-05
మన హక్కులు.. మన భవిష్యత్ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ రైట్స్ వాక్ నిర్వహించారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన హక్కులు.. మన భవిష్యత్ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ రైట్స్ వాక్ నిర్వహించారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా రంజిత్ రెడ్డి
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం సమానంగా అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాధించినట్లు అవుతుందని అన్నారు. విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కులని పేర్కొన్నారు.
యువతకు రంజిత్ రెడ్డి సూచనలు
యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని రంజిత్ రెడ్డి సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ర్యాలీలో నినాదాలు
ర్యాలీలో పాల్గొన్న యువత విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.












