Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
నిజామాబాద్ నగరంలో కంకర రాళ్లకు బంగారు రంగు పూత పూసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుగా తీసుకున్న రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించేందుకు, బాకీదారుడిని నమ్మించి, కంకర రాళ్లను బంగారం రాళ్లుగా చిత్రీకరించి ఇచ్చి మోసం చేశాడు. బాధితుడు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిజామాబాద్ నగరంలో కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాకీ తీర్చాలన్న ఒత్తిడితో, అప్పు తీసుకున్న వ్యక్తి కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసి ఇచ్చి మోసం చేశాడు.
వివరాల్లోకి వెళితే, హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద శ్రీనివాస్ రూ.1.30 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని రమేష్ ఒత్తిడి తేవడంతో, శ్రీనివాస్ తన వద్ద గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని నమ్మించాడు. ఆ బంగారు రాళ్లను అప్పు కింద పట్టుకోమని రమేష్‌ను ఒప్పించాడు.
నిజామాబాద్‌లో కాకుండా డిచ్పల్లి మండలం ఘన్ పూర్‌కు అదనంగా రూ.32 వేలు తీసుకొని రావాలని రమేష్‌కు సూచించాడు. అనంతరం, నాలుగు కుండల్లో నాలుగు బంగారం రాళ్లను శ్రీనివాస్ రమేష్‌కు అందించాడు. అయితే, అనుమానం వచ్చి పరిశీలించిన రమేష్, అవి నిజమైన బంగారం రాళ్లు కావని, కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు గుర్తించాడు.
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రమేష్, వెంటనే డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












