విజయదశమి పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూరాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించి, దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.
విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలను కలిగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, డిఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రవికుమార్, ఇన్స్పెక్టర్లు వేణు, ఆరిఫ్ అలీ ఖాన్, కరుణాకర్, శ్రీనివాస్, శ్రీధర్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.











