రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవదుర్గ సేవా సమితి ట్రస్టు సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కస్తూరి శ్రీనివాస్ ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సామండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి, లక్ష్మణ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బండ శంకర్, డీఎస్పీ పురుషోత్తం, సిఐ కరుణాకర్, అనుమల్ల చంద్రం, నాగరాజు, ఉమాపతి, నవదుర్గ సేవా సమితి ట్రస్టు సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











