Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
పబ్లిక్ పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా, బుధవారం రాజ్యసభలోనూ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును పార్లమెంట్ గురువారం ఆమోదించింది. ఇప్పటికే బుధవారం లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేసినప్పటికీ, రాజ్యసభలో మూజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును ఆమోదించారు.
సవరించిన బిల్లు ప్రకారం, పరీక్ష పేపర్ల లీక్‌కు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. పేపర్ల లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కనీసం 5 ఏళ్లు, గరిష్ఠంగా 10 ఏళ్లు కారాగార శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు.
ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారికి ఏడేళ్ల కనీస శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి.












