కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, పుట్ట రవి మాదిగ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యం లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలగందుల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాడి సాధించుకున్న ఫలాలను అందుకునే విషయ వెనుకబాటుతనం ఉందని, కాబట్టి విద్యతోనే మన భవిష్యత్తు ముడిపడి ఉందని అన్నారు. మాదిగ విద్యార్థులు బాగా చదువుకొని, ప్రతి గ్రామ , మండల , కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, అన్ని యూనివర్సిటీలలో ఉన్న మాదిగ విద్యార్థులందరూ ఎంఎస్ఎఫ్లో పనిచేయాలని, ఇది మన భవిష్యత్తును రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పిలుపునిచ్చారు.
విద్యార్థులు కేవలం భవిష్యత్ పౌరులు మాత్రమే కాకుండా, వర్తమాన నే సమాజంపై బాధ్యత కలిగిన శక్తిగా ఎదగాలని ఆయన సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, ఆయన చిన్ననాటి జీవిత కుల వివక్ష, అంటరానితనం వంటి తీవ్రమైన సామాజిక సమస్యలను ఎదుర్కొన్నట్లు రాజ్యాంగ చరిత్రకు సంబంధించిన ఆధారాలు పేర్కొంటున్నాయని, అందువల్ల విద్యార్థులు అంబేద్కర్ జీవితాన్ని కేవలం ఒక చారిత్రక వ్యక్తి జీవితంగా కాకుండా విద్య, పట్టుదల, సమానత్వం, సామాజిక న్యాయం, దేశ సేవకు సంబంధించిన స్ఫూర్తిగా చూడాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, సేవాభావంతో ముందుకు సాగాలని బిక్షపతి మాదిగ సూచించారు.
ఈ ఎన్నికల్లో కన్నం రాకేష్ మాదిగ (పీజీ) అధ్యక్షునిగా, ఎర్రోల్ల రాజేష్ మాదిగ (బీసీఏ) అధికార ప్రతినిధిగా, బొర్రా సచిన్ మాదిగ (ఐటీఐ), కన్నం దినాకర్ మాదిగ (ఇంటర్ సెకండ్ ఇయర్) ప్రధాన కార్యదర్శులుగా, ఉల్లెందుల భరత్ మాదిగ (ఇంటర్ సెకండ్ ఇయర్), కర్రోల నితిన్ మాదిగ (ఇంటర్ సెకండ్ ఇయర్) ఉపాధ్యక్షులుగా, కన్నం అక్షయ్ మాదిగ (ఎంసీఏ) కోశాధికారిగా, కర్రోళ్ల కిషోర్మాదిగ (డిగ్రీ), ఎలగందుల అకిరానంద్ మాదిగ (ఇంటర్ ఫస్ట్ ఇయర్), కన్నం రాహుల్ మాదిగ (ఇంటర్ సెకండ్ ఇయర్) కార్యదర్శులుగా, కిష్టంపేట సాయి వినయ్ మాదిగ (ఇంటర్ ఫస్ట్ ఇయర్) సహాయక కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నం రాకేష్ మాదిగ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలందరికీ, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఎంఎస్ఎఫ్ నిర్మాణ, వ్యవస్థీకరణ కార్యకలాపాలలో, విద్యార్థుల సమస్యల పరిష్కార , విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో, మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కన్నం బాలరాజు మాదిగ, బొర్ర దినేష్ మాదిగ, కరోల్ల దేవరాజు మాదిగ, ఎలగందుల హరీష్ మాదిగ, కుల సంఘ పెద్దమనుషులు మరియు తదితరులు పాల్గొన్నారు.












