రాయికల్, 2024-08-29
విద్యతో పాటు క్రీడా రంగాల్లో విద్యార్థులు, యువత రాణించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులను, తెలుగు పండితులను ఘనంగా సన్మానించారు. అనంతరం రాయికల్ బాయ్స్ హై స్కూల్ లో బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించారు.
విద్యతో పాటు క్రీడా రంగాల్లో విద్యార్థులు, యువత రాణించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులను, తెలుగు పండితులను శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.
అనంతరం రాయికల్ బాయ్స్ హై స్కూల్ లో బాస్కెట్ బాల్ స్టేట్ పూర్వ క్రీడాకారులు వాసం ప్రసాద్, దాసరి గంగాధర్, బందెల శ్రీనివాస్, తాటిపాముల శ్యామ్, కుర్మ సుదర్శన్ రెడ్డి, దేవేందర్ల సహకారంతో రూ. 15 వేల విలువైన రింగ్స్, కలర్లు, బాస్కెట్ బాల్‌ను అందించి, బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత, విద్యార్థులకు చదువుతోపాటు వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు గ్రామీణ క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, క్రీడలపై అవగాహన కల్పించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. క్రీడాకారులను తయారు చేసి, జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించేలా తీర్చిదిద్ది, రాయికల్ మండలానికి పేరు తేవాలని సూచించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడి నుంచి దూరం కావచ్చని, ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి సుధవేణి మురళి, క్లబ్ సభ్యులు బత్తిని భూమయ్య, మ్యకల రమేష్, మచ్చశేఖర్, దాసరి గంగాధర్, కుర్మ సుదర్శన్ రెడ్డి, ఆడెపు రాంప్రసాద్, బాలే నిఖిల్, సాంబారు శ్రీనివాస్, పులి రమేష్, సామల్ల సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు, తెలుగు పండిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.












