నియోజకవర్గ (ధర్మ రథం) నవంబర్ 12
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయి 100 పడకల ఆసుపత్రిగా పునరుద్ధరించాలని, అవసరమైన వైద్యులు, సిబ్బంది, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో 100 పడకల ఆసుపత్రిగా పునరుద్ధరించాలని, 100 పడకలకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, అన్ని వైద్య సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావు ఆధ్వర్యంలో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ స్వాతి అనూప్ రావు, పట్టణ అధ్యక్షుడు మేకల గణేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. వంద పడకలకు అనుగుణంగా స్పెషలిస్ట్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మందులు, అత్యవసర చికిత్స సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, గుంటుక సదాశివ్, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గుత్తిల తుకారాం గౌడ్, ఎండోమెంట్ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ మాడవేణి నరేష్, ఇందూరి తిరుమల వాసుతో పాటు వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, , మండల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







