Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 21
మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ లో మొత్తం 12 కేసులకు పరిష్కారం లభించింది. ఈ కేసుల విలువ సుమారు రూ. 66.83 లక్షలకు చేరింది. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వేముల దీప్తి ఈ విషయాన్ని వెల్లడించారు.
మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు ఈ రోజు జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ లో 11 ఎస్టీసీ ( యాక్ట్) కేసులు, 1 సీసీ ( యాక్ట్) కేసు పరిష్కారం అయ్యాయని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వేముల దీప్తి తెలిపారు. మొత్తం 12 కేసులకుగాను రూపాయలు 66,83,000/- కు పరిష్కారం అయ్యాయని ఆమె పేర్కొన్నారు. లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామోసరీ నోటు కేసులు, బ్యాంకు రుణాలు, ఆస్తి తగాదాలు వంటి వాటిని పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఈ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జింకల రమేష్, కె. విజయ్ కుమార్, కోర్టు సూపర్డెంట్లు టి. వెంకన్న, సి హెచ్ మల్లేశ్వర రావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.







