Jagtial/Koratla (ధర్మ రథం) నవంబర్ 28
కోరుట్ల పట్టణంలోని సర్వే నెం. 1490లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అనధికార లే అవుట్ లో జరుగుతున్న ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేయాలని కోరుట్ల పట్టణ బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ వెంచర్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు కొనుగోలుదారులు నష్టపోతున్నారని వారు ఆరోపించారు.
కోరుట్ల పట్టణంలోని సర్వే నెం. 1490లో అనధికార లే అవుట్ లో జరుగుతున్న విక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అక్రమ వెంచర్ పై అధికారులకు ఫిర్యాదు
కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్ రోడ్ పరిధిలో గల సర్వే నెంబర్ 1490 మరియు దాని సబ్ డివిజన్లలోని 4.12 ఎకరాల భూమిలో ఎలాంటి అధికారిక తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, లే-అవుట్ డీటిసిపి, రెరా అనుమతులు లేకుండా అనధికార వెంచర్ ఏర్పాటు చేసి అక్రమ ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని కోరుట్ల ఆర్డిఓ, తహశీల్దార్, మున్సిపాలిటీ, సబ్ రిజిస్ట్రార్ అధికారులకు కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ ఇందురి తిరుమలవాసు, మాడవేని నరేష్, కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాకల గణేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
ఆదాయానికి గండి, కొనుగోలుదారులకు నష్టం
ఈ అనధికార లే అవుట్ ఏర్పాటు వల్ల కోరుట్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడడంతో పాటు అమాయక కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కస్తూరి లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే ఈ అనధికార లే అవుట్ వల్ల రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, మార్టిగేజ్ నిబంధనలు పాటించకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 (సెక్షన్-172), : 131, సవరణ : 135, - / నిబంధనలు, నియమాలు, రిజిస్ట్రేషన్ చట్టం-1908 (సెక్షన్-81) ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు.
చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో కోరుట్ల తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సర్వే నెం: 1490, సబ్ డివిజన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా, అక్రమ నిర్మాణాలు తొలగించాలని, అక్రమ వెంచర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కస్తూరి లక్ష్మీనారాయణ అధికారులను కోరారు.







