సిద్దిపేట, 2026-11-22
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాబుకు అత్యవసరంగా O పాజిటివ్ రక్తం అవసరమని తెలియగానే, పెద్ద కోడూరు గ్రామానికి చెందిన రక్తదాత పల్లె భిక్షపతి వెంటనే స్పందించారు. ఆయన O పాజిటివ్ 1 యూనిట్ రక్తాన్ని స్వచ్ఛందంగా అందించి, పసి ప్రాణాలను కాపాడారు.
పల్లె భిక్షపతి ఇలా రక్తదానం చేయడం ఇది 17వ సారని వాత్సల్య పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా రోగి మానస భర్త ధనుంజయ్, కుటుంబ సభ్యులు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వాత్సల్య బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆకారపు సుధాకర్, అధ్యక్షులు లింగంపెల్లి ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు బచపల్లి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముద్రకోల సంతోష్, సహాయక కార్యదర్శి గోరుటాల శ్రీకాంత్ పాల్గొన్నారు.







