Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 27
పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులను గట్టెక్కించేందుకు అధికార ఎన్డీయే కూటమికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం సవాలుగా మారింది. డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్), వైఎస్సార్సీపీ ఎంపీల వైఖరి కీలకం కానుంది.

ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులున్నారని కథనంలో పేర్కొన్నారు. సభ్యులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 360 ఓట్లు అవసరం. అయితే ఎన్డీయేకు 320 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉందని అంచనా. దీంతో మరో 40 ఓట్లు సమీకరించాల్సి ఉంటుంది.
మూడు పార్టీల మద్దతు లభిస్తే
డీఎంకే 22 మంది, ఎన్సీపీ (శరద్ పవార్) 8 మంది, వైఎస్సార్సీపీ 4 మంది. ఈ మూడు పార్టీలకు చెందిన 34 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినా ఎన్డీయే బలం 354కు మాత్రమే చేరుతుంది. ఇంకా ఆరు ఓట్లు అవసరమవుతాయి.
గైర్హాజరైతే మారే లెక్కలు
డీఎంకే ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండి, ఎన్సీపీ, వైసీపీ మద్దతు ఇస్తే ఎన్డీయే బలం 332కు చేరుతుంది. అయినా మరో 14 ఓట్లు అవసరం. డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు గైర్హాజరై, వైసీపీ మద్దతు ఇస్తే ఎన్డీయే బలం 324 అవుతుంది. ఈ పరిస్థితిలోనూ మరో 16 ఓట్లు కావాలి.
గతంలోనూ బిల్లు వీగిపోయింది
గతంలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుల అంశం మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రాంతీయ పార్టీల వైఖరిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.